జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 26

నెమ్మదిగా ముందుకు సాగుతూ ఆకలి వేస్తుండగా హాట్ బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఆమె ఇంటికి చేరతాడు. ఆమె హాండ్ బాగ్ లోని తాళం తీసుకొని దానిని చేతికి తగిలించుకుని ఇంటి వాకిలి తెరిచి బాగ్ లోపల సోఫా ఎదురుగా ఉన్న కాఫీ టేబుల్ పై ఉంచి, ఓమ్ని దగ్గరకు వచ్చి శబ్దం రాకుండా డోర్ తెరిచి సీట్ బెల్ట్ తీసివేసి ఆమెను ఎత్తుకొని వెళ్లి బెడ్ రూమ్ లో పడుకోబెట్టి స్లీప్ టెంపరేచర్ కు ఏసీ adjust చేసి టవల్ తొలగించి నడుము వరకు రగ్గును కప్పి అతడి రెండు చేతులతో ఆమె రెండు చంపలను సున్నితంగా పట్టుకొని పెదాలపై మరియు నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి , “సాయంత్రం వస్తాను love you అమ్మ , పోలీస్ విక్రమ్ అర్జంట్ గా రమ్మన్నాడు “అని ఒక పేపర్ లో రాసి ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ bottle తీసుకు వచ్చి దానిపై ఉంచి పక్కనే ఉన్న టేబుల్ డ్రా లు మరియు భీరువాలు వేతకగా ఆమె బ్యాంక్ బుక్ కనిపించగా దానిని జేబులో పెట్టుకొని బయటకు వస్తు లోపల నుండి వాకిలి ఘడియ పెట్టి ఇంటి లోపల పైకి మెట్లు ఉండటంతో పైకి వెళ్లి ఇంటి తాళాన్ని పైన ఉన్న వాకిలి వేసి పైపు ద్వారా కిందకు దిగి విక్రమ్ ను కలవడానికి పోలీస్ స్టేషన్ కు వెళతాడు.

20 నిమిషాల్లో అక్కడకు చేరుకోగా స్టేషన్ బయట తన కారు కనిపించడంతో సాగర్ కూడా వచ్చాడని కాంపౌండ్ లోపలికి వెళుతుండగా లోపల సుమారు 30 -40 మంది జనాలు ఏడుస్తూ ఉండగా మహేష్ కోసమే ఎదురు చూస్తున్న విక్రమ్ మరియు సాగర్ లు అతడి దగ్గరకు రాగా ఏమయ్యింది సర్ ఇంతమంది బాధపడుతున్నారు అని అడుగగా , మనం రక్షించిన అమ్మాయిలతో పాటు ఆ రోజే ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా కిడ్నప్ అయ్యారు ,వారి వారి బంధువులు వీళ్ళు అని విక్రమ్ చెప్పగా

కాళీ ఎక్కడ ఉన్నాడు అని అడుగగా ఇంకెక్కడా కాళీ రాత్రి హాస్పిటల్ లో చేర్చిన గంటకు కోమా లోకి వెళ్లిపోయాదని ఉదయం హాస్పిటల్ కు వెళితే తెలిసిందని విక్రమ్ చెప్పగా, నిన్న మనం పక్క ఆధారాలతో కాళీ గాడిని పెట్టుకున్నాం కదా ఆ ఆధారాలు చూపించి గోవా లో వాడి రహస్య ప్రదేశాలు సెర్చ్ చెయ్యడానికి పెర్మిషన్ తీసుకొని మీ స్టేషన్ లో ఉన్న మిగతా పోలీస్ లతో పెట్టుకోవచ్చు అని చెప్పగా , ఉదయం నుండి ఎంత ప్రయత్నించినా నా పైన ఉన్నవారు ఆ మూర్ఖుడి లంచాలు తిన్నందువల్ల నాకు ఆ అథారిటీ ఇవ్వడం లేదు . ఈ రోజు మనం ఎలాగైనా వాడు కిడ్నప్ చేసినట్టు వీడియో ఆధారాలు తెస్తే తప్ప అతడికి పెద్ద శిక్ష వేయించలేం అని విక్రమ్ నిరాశ చెందుతుండగా , సాగర్ తో కొన్ని అతడి ప్రదేశాల వివరాలు ఉన్నాయి మరియు మీ స్టేషన్ లో అతడి గురించి ఎంతోకొంత సమాచారం ఉంటుంది వాటి ద్వారా ఇకపై అతడిని వెనకేసుకు రావాలన్న ప్రతి ఒక్కరు భయపడే విధంగా మొత్తం ఆధారాలు సేకరిద్దాం అని ముగ్గురు భయలుదేరుతు కిడ్నప్ అయ్యిన వారి బంధువుల దగ్గరికి వెళ్లి ప్లాన్ అంత వివరించి సహాయం చేసేవాళ్ళు తమతో పాటు రావచ్చు అనగా ఒక్కొక్క కుటుంభం నుండి ఒక్కొక్కరు రాగా తమ మూడు వాహనాలతోపాటు ఇంకా వాళ్ళ కూతురిని లేదా చెల్లెళ్లను రక్షించుకోవడానికి మరో 5 వాహనాల్లో ముందుకు కాదులుతారు.

Pages ( 3 of 5 ): « Previous12 3 45Next »

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!