భామాకలాపం 2

telugu sex stories boothu kathalu అదంతా చూసి చులకనగా నవ్వుకుంది సుదీర. ఒకవైపు ఇరవయ్యో శతాబ్దం ముగిసిపోతున్నా ఈ ఇంటి మనుషులు ఇంకా ఇరవయ్యో శతాబ్దంలోకి అడుగన్నా పెట్టినట్లు లేదు. చాలా సనాతనంగా కనబడుతోంది ఈ ఇంటి వాతావరణం.

అసలు ఈ నాయకుల ఫోటోలు ఇన్నెందుకు? మమ్మీ ఆఫీసు రూమ్ లో కూడా రాజకీయవేత్తల బ్లో అప్ ఫోటోలు స్టీలు ఫ్రేముల్లో బిగించి ఉంటాయి. ఒకటో- రెండో- ఎవరు దశలో ఉంటె వాళ్ళవి! అంతేగానీ, మరి ఇంత వెర్రిగా మాత్రం కాదు.

“నిలబడే ఉన్నారే, కూర్చోండి!” అంది భరత్ చెల్లెలు, నగిషి చెక్కి ఉన్న పాతకాలపు కుర్చీని చూపిస్తూ.

“థాంక్స్!” అని కూర్చుంటూ, “వాట్స్ యువర్ నేమ్!” అని అడిగింది సుదీర.

“స్వతంత్ర భారతి!”

 

“వాట్?”

 

“స్వతంత్ర భారతి!”

 

“యూ ఆర్ జొకింగ్!” అంది సుదీర అపనమ్మకంగా. స్వతంత్ర భారతి అన్న పేరు పెట్టుకుంటారా ఎవరైనా అసలు?

“అవునమ్మా! స్వతంత్ర భారతి అనే పేరు పెట్టాను అమ్మాయికి. స్వతంత్రం కోసం కలవరించి పోయేవాళ్ళం ఆ రోజుల్లో. స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే పెళ్ళి చేసుకున్నానమ్మా! ఆ తరవాత పదిహేనేళ్ళకు పుట్టాడు అబ్బాయి. ఇరవై ఏళ్ళ తర్వాత పుట్టుంది అమ్మాయి. వాళ్లకు విజయ్ భరత్, స్వతంత్ర భారతి అని పేరు పెట్టి నా మువ్చట తిర్చుకున్నాను” అన్నారు సదాశివరావుగారు పూజగదిలో నుంచి బయటికి వస్తూ.

అయన కుడిచెయ్యి పడిపోయి ఉంది. కుడికాలు కొంచెం ఈడుస్తూ నడుస్తున్నారు. బ్రిటిష్ వారు జైల్లో పెట్టి గోళ్ళలో గుండు సూదులు గుచ్చి, బట్టలు విప్పి నగ్నంగా మంచు దిమ్మల మీద పడుకోబెట్టి , చిత్ర హింసలు పెట్టడం వల్ల ఆరోగ్యం దెబ్బ తిని శాశ్వతంగా దుర్భాలుడై పోయారు అయన. కానీ, అయన మొహం మాత్రం ప్రశాంతంగా ఉంది. పెదిమల మీద చిరునవ్వు మెదులుతోంది. వయసు మీద పడినా కూడా చిన్న పిల్లల మనస్తత్వంతోనే ఉండి, కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అయన కూడా అలాంటి మనిషే. ముతక ఖద్దరు పంచె లాల్చి.

“ఏమిటి చూస్తున్నావ్? ఆ ఫోటోలా! అలాంటివి ఇంకా ఆల్బం నిండా ఉన్నాయమ్మా! అదిగో, ఆ ముగ్గురూ ఎవరో తెలుసా? లాల్, బాల్, పాల్ అని మురిపెంగా పిలుచుకునే వాళ్ళం- లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్…………’

అయన చెబుతూనే ఉన్నారు. లోపల లయబద్దంగా వినబడుతున్న అడుగుల చప్పుడు ఆగిపోయింది. ఒక పిల్లాడి గొంతు వినబడుతోంది- “మీరు ఫీజు ఎంత తీసుకుంటారో కనుక్కొమ్మని అమ్మ చెప్పింది సార్!”

భరత్ నవ్వాడు. “ఫీజు లెదూ, ఏమి లెదూ. ఈ డాన్సు అన్నయ్య, పాటల అక్కయ్య అందరికి ఫ్రీగా నేర్పిస్తారని అమ్మకి చెప్పు. అంతేకాదు. బుద్దిగా, శ్రద్దగా నేర్చుకుంటే బిస్కెట్లు, చాక్లెట్లు కూడా ఇస్తాడని చెప్పు. సరేనా? చెల్లెలు రాలేదేం ఇవాళ?”

“జ్వరం అన్నయ్యా! రేపటి నుంచి మళ్ళీ వస్తుంది.

పిల్లలందరూ బిలబిల్లాడుతూ బయటకు వచ్చారు. ఆ వెనకేనే టవల్ తో మొహం తుడుచుకుంటూ వచ్చాడు భరత్. కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్లింది భారతి.

 

హాండ్ బాగ్ లో నుంచి సరికొత్త అయిదు రూపాయల నోట్ల కట్ట తీసింది సుదీర. “రాత్రి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీకు ఇవ్వవలసిన మూడు వందలకి బదులు అయిదు వందలు ఇస్తున్నాము- తీసుకోండి” అంది ఇంగ్లీషులో.

భరత్ ఆ డబ్బు అందుకునే ప్రయత్నం చెయ్యలేదు. “మీరు……?” అన్నాడు నిశితంగా చూస్తూ.

“నేను రత్నాకరరావు గారి డాటర్ని.’

ఆమె ఉహించినట్లు అతని మోహంలో కోపం కనబడలేదు. ‘నేను నిన్న ప్రోగ్రాం సగంలో వదిలేసి వచ్చాను. మీరు నాకు డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు” అన్నాడు చాలా మాములుగా.

భారతి పెద్ద స్టీలు గ్లాసు తెచ్చి, “కాఫీ తీసుకోండి!” అంటూ అందించింది.

కాఫీ గ్లాసు చేతిలో పట్టుకుని చుట్టూరా చూసింది సుదీర. రెక్కలు లేని రామ చిలక ఒకటి తలుపు తెరచి వున్న పంజరంలో నుంచి కిందికి గెంతి, నడుస్తూ భరత్ వైపు వెళ్ళింది.

కొయ్య షెల్ఫులో నుంచి రెండు చాక్లెట్లు, కొన్ని గింజలు తీసి చిలకకి పెట్టాడు భరత్.

 

“మా అన్నయ్య పంచప్రాణాలు ఆ చిలకలోనే ఉన్నాయి. అతి గారాభం చేస్తాడు దాన్ని. తను అడిగింది ఇవ్వకపోతే కాకిగోల చేస్తుంది ఈ చిలక!” అంది భారతి నవ్వుతూ. “అసలు ఇది మా అన్నయ్యకి ఎలా దొరికిందో తెలుసా అండి?”

“భారతీ!” అన్నాడు భరత్ వారిస్తూ.

వినిపించుకోకుండా చెప్పింది భారతి- “ఒకసారి మా అన్నయ్య ఎక్కడో ప్రోగ్రాం ఇచ్చి జేబులో రెండు వందల రూపాయలతో తిరిగి వస్తున్నాడు. దారిలో చిలక ప్రశ్న చెప్పేవాడు ఒకతను ఆపాడు అన్నయ్యని. అతని పక్కనే ఇరుకు పంజరంలో తోకా, రెక్కలు కత్తిరించేసి ఉన్న చిలక చికాకుగా తిరుగుతోంది. దాని అవస్థ చూసి గుండె కరిగిపోయి దగ్గర కెళ్ళాడు అన్నయ్య. చిలక అలవాటుగా ముక్కుతో ఒక చీటీ తీసింది. ‘అద్భుతమైన లావణ్యం, అపారమైన ఐశ్వర్యం కళ అమ్మాయి నిన్ను మోహించి పెళ్ళి చేసుకుంటుంది’ అని ఉంది దానిలో. మా అన్నయ్య అది నమ్మకుండా నవ్వుకుని జేబులో వున్న రెండొందలు రూపాయలు ఆ చిలక ప్రశ్నవాడికి ఇచ్చేసి, దాన్ని మా ఇంటికి తీసుకొచ్చి పెంచడం మొదలెట్టాడు.”

హేళనగా మనసులోనే నవ్వుకుంది సుదీర. ఎవరో అద్భుతమైన లావణ్యం, అపారమైన ఐశ్వర్యం కల అమ్మాయి ఇతన్ని మోహించి పెళ్ళి చేసుకుంటుందట. పాపం…….ఇంతకంటే గొప్ప మగాడు దొరకడని!

“మీ చిలకకి మరి అతి చనువు ఇస్తున్నట్లున్నారే! మనం పెంచుకునే పెట్స్ ని డిసిప్లిన్ లో పెట్టాలి” అంది సుదీర.

ఆమె దగ్గర పెంపుడు కుక్కలు ఏడు వున్నాయి. వాటిని మిలటిరి డిసిప్లెన్ లో ఉంచుతుంది తను. ఆమె ముందు అవి ఇష్టం వచ్చినట్లు తోకాడించడానికి కూడా వీల్లేదు.

సంతోషంగా అరుస్తూ చాక్లెట్ ని ముక్కుతో పొడిచి తింటోంది చిలక.

 

“సుదీరా ఊరికే వాగకు – తలనొప్పి!” అన్నాడు భరత్.

ఉలిక్కిపడి , భరత్ వైపు తీవ్రంగా చూసింది సుదీర. “వాడ్యూ మీన్? నన్ను వాగకు , గీగకు అని అంటారా? హో డేర్ యూ!” అంది ఆగ్రహంగా.

 

తెల్లబోయాడు భరత్. “నేను మిమ్మల్నేందుకు అంటాను? సుదీరని కోప్పడుతున్నాను.”

“మళ్ళీ అదే! సుదీర ఎవరు………నేను కాక?”

భరత్, స్వతంత్ర భారతి ఒకళ్ళని ఒకళ్ళు నవ్వు మొహంతో చూసుకున్నారు. “మా చిలక పేరు కూడా సుదీరే!” అంది భారతి.

“దీని పేరు సుదీరా? ఎవర్నడిగి పెట్టారు ఆ పేరు?” అంది సుదీర వళ్ళు తెలియని కోపంతో.

“సారీ! మీ పేరు కాపీ రైట్ ని నాకు తెలియదు” అన్నాడు భరత్.

 

“ముందు కాఫీ తాగండి. కోపం తగ్గుతుంది.” అంది భారతి నవ్వుతూ.

 

“సుదీర కుర్చీలో ఇబ్బందిగా కదిలింది. “మీరు తాగారా?”

“మేం తెల్లవారుజామునే లేచి కాఫీలు తాగేస్తాం. ఆ తర్వాత మళ్ళీ భోజనమే. మధ్యలో ఇంకేమి తీసుకోము. అయితే ఈ అంక్షలన్ని మా అతిధుల నెత్తిన రుద్దేయ్యంలెండి.’ అంది భారతి.

ఆ ఇంట్లోని మనుషుల ప్రవర్తన తమాషాగా కనబడింది సుదీరకి. ఎదురి వ్యక్తితో కొత్తా పాతా లేకుండా కలిసిపోతూ……..సరదాగా మాట్లాడుతూ నిష్కల్మషంగా ఉన్నారు వీళ్ళు.

చిలక- సోల్జరు మార్చి చేస్తున్నట్లు కాసేపు అటూ ఇటూ పచార్లు చేసి, తర్వాత గుమ్మం దాటి బయటికి వెళ్ళింది.

గుమ్మం దగ్గర ఎవరో చెప్పులు వదులుతున్న చప్పుడు.

భారతి చూసి, “సుమిత్ర అత్తయ్య!” అంది సంతోషంగా.

వస్తూనే చేతిలోని పుస్తకాలు హాండ్ బాగ్ చాపమీద పెట్టి కూర్చుంటూ “భారతి! నీకు మార్కులు ఎంత  పర్సెంట్ వచ్చాయే?” అంది సుమిత్ర.

చెప్పింది భారతి.

వెంటనే సుమిత్ర మొహం వికసించింది. “మరింకేం! నీకు మంచి కోర్సులో సీటు ఇప్పిస్తాను. మా స్టాఫ్ కి కూడా కోటా ఉందిట. ఇందాక సుందర్రావుగారు చెప్పేదాకా నాకూ తెలియనే తెలియదు. తెలియగానే వెంటనే ఇటూ వచ్చేశాను.”

“నిజంగానా?” అంది భారతి పట్టశక్యం కానీ సంతోషంతో.

మళ్ళీ వివరంగా చెప్పింది సుమిత్ర. తర్వాత, అప్పుడే గమనించినట్లు సుదీర వైపు అనుమానంగా చూసి, “ఇలా రా!” అని భారతిని లోపలికి తీసుకెళ్ళింది. లోపల నుంచి గుసగుసగా మాటలు.

“అలా అయితే వద్దత్తయ్యా!” అంటోంది భారతి గట్టిగా.

“నీ మొహం . ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో.!” అని గదమాయిస్తోంది సుమిత్ర.

“నాకు ఇష్టం లేదత్తయ్యా!”

“అసలు నా మాటంటేనే మీకు లక్ష్యం లేదు లేవే! నువ్వూ అంతే, మీ అన్నా అంతే, మీ నాన్నా అంతే!” అంది సుమిత్ర కోపంగా.

 

ఏమిటమ్మా గొడవ?” అంటూ నెమ్మదిగా నడుస్తూ లోపలికి వెళ్ళారు సదాశివరావుగారు. భరత్ కూడా వెనకనే వెళ్ళాడు.

సుదీర వింటుందని భారతి వారిస్తున్నా కూడా కోపాన్ని ఆపుకోలేక పెద్దగా మాట్లాడేస్తోంది సుమిత్ర. “చూడన్నయ్యా! దీనికి లక్షణంగా మంచి కోర్సులో సీటు దొరికే ఛాన్సు వచ్చింది- నా కోటాలో. అయితే , ఇక్కడొక చిన్న టెక్నికల్ పాయింటు సీటు నా పిల్లలికి మాత్రమే ఇస్తారట. అదేం పెద్ద ఇబ్బంది కాదులే! నేను భారతిని దత్తత తీసుకున్నట్లు డాక్యుమెంటు ఒకటి రాసుకుంటే చాలుట! డబ్బులు పడేస్తే అయిదు నిమిషాల పని. దానికి ఇది పెద్ద రాద్దాంతం చేస్తోంది. నీ జీవితం బాగుపడుతుందే తల్లి అంటే ఈ మొద్దు రాచ్చిప్పకు అర్ధం కాదే!”

“సారీ! అత్తయ్యా!” అంది భారతి స్థిరంగా. ఇందాకటి అమాయకత్వము, అనుకువా ఇప్పుడామె గొంతులో ద్వనించడం లేదు. “నాకు పెద్ద పెద్ద చదువులు చదవాలనే ఉంది. ఆ కోర్సులో సీటు రావడమంటే న మటుకు నాకు భాగ్యలక్ష్మి లాటరీ తగిలినట్లే! అయితే, ఇలాంటి పద్దతుల్లో సీటు వచ్చినా నాకు వద్దు – దత్తత అనేది ఉత్త ఫార్మాలిటి అయినా సరే. సీటు రావడం నాకు చాలా ముఖ్యం! కాని సీటు కంటే కూడా సదాశివరావుగారి కూతురిగా చలామణి కావడమే చాలాచాలా ముఖ్యం నాకు. ఇది అయ్యే పని కాదు. నన్ను క్షమించత్తయ్యా!” అంది.

అసహనంగా సదాశివరావుగారి వైపు తిరిగింది సుమిత్ర. “దానికి తెలియకపోతే నువ్వన్నా చెప్పకుడదా, అన్నయ్యా? ఇట్లా మడిగట్టుకు కూర్చుంటే ఈ రోజుల్లో ముందుకు పోలేం మనం. నీతి నిజాయితీ , దేశం గిశం అంటూ నువ్వు చేతులు కాల్చుకున్నది చాలు. పిల్లలనన్నా భాగుపడమని చెప్పు!” అంది విసురుగా.

 

సదాశివరావుగారు శాంతంగా వింటూ, మౌనంగా ఉండిపోయారు.

“నువ్వన్నా చెప్పరా భరత్!”

“శాంతి………శాంతి!” అన్నాడు భరత్ -౦ ఆ భావాన్ని అభినయించి చూపుతూ.

అవమానంతో, ఆగ్రహంతో ఉగిపోయింది సుమిత్ర. “చీ! చీ! ఈ ప్రపంచంలో మీకన్నా అప్రయోజకులు. అవివేకులు, అసమర్ధులు – అరచేతిలోకి వస్తున్నా అదృష్టాన్ని అరికాలితో తోక్కేసుకునే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. వుండరు గాక ఉండరు!” అంది తీవ్రంగా. ఆమెకి ఉక్రోషంతో కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి.

అందరు మౌనంగా ఉండిపోయారు.

హలో కూర్చుని ఉన్న సుదీరకు ఇదంతా వినబడుతూనే ఉంది. వాళ్ళు అలా  గొడవ పడుతుంటే తను ఇక్కడే ఉండడం బావుండదేమో అనిపించింది. నిశ్శబ్దంగా లేచి నిలబడి , అప్పటిదాకా చేతిలోనే పట్టుకుని ఉన్న డబ్బు టేబుల్ మీద వుంచింది.

లోపల కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుని అందరి మొహాల వైపు ఒకసారి చూసింది సుమిత్ర.

 

తర్వాత తన్ని తాను సంభాళించుకుని వణుకుతున్న గొంతుని అదుపులోకి తెచ్చుకుంటూ అన్నది. “మీరెందుకు పనికిరాని అవివేకులు! అయినా, అక్కడక్కడా మీలాంటి అవివేకులు, అప్రయోజకులు, అసమర్ధులు ఇంకా మిగిలి ఉండి న్యాయం. ధర్మం, అంటూ పాకులాడుతూ ఉండడం వల్లనే ఈ ప్రపంచం ఈ మాత్రంగా నైనా మిగిలి ఉందేమో!”

 

“అత్తయ్యా!” అంటూ ఆమె దగ్గరగా వెళ్ళింది భారతి.

సుమిత్ర ఆప్యాయంగా ఆ అమ్మాయి చేతిని వత్తింది. “సరే! నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక్కడ నా డ్యూటీ అయిపొయింది. ఇంకా యునివర్సిటిలో నా తప్పనిసరి డ్యూటీకి వెళ్లిరానా?” అంది నవ్వుతూ. ఆర్ద్రంగా వుంది ఆమె గొంతు. మళ్ళీ మామూలు మూడ్ లో పడిపోయారు అందరూ.

వాళ్ళు బయటికి వచ్చే లోపలే త్వరత్వరగా తన కారు దగ్గరికి వెళ్ళిపోయింది సుదీర. అప్పటికే వెనక సీటులో ఎక్కి ఉంది కుక్క సిల్వర్.

దూరంగా నిలబడి సిగరెట్ కాల్చుకుంటూ వున్న డ్రైవర్ ఛోటూ సుదీరని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు.

ఫ్రెంట్ సీట్లో కూర్చుంది సుదీర. కారు కదిలింది.

సుదీర ఇంటి కొచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారు సీతా, రత్నాకరరావు, లాయర్ సారధి కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. సీతా, రత్నాకరరావు కలిసి తీరిగ్గా మాట్లాడుకునేది పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే! ఆ తరువాత ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. లంచ్, డిన్నర్ సాధారణంగా బయటే తీసుకోవలసి వస్తుంది.

తల్లిదండ్రులిద్దర్నీ ఒక చోట చూసినప్పుడల్లా నవ్వొస్తూ ఉంటుంది సుదీరకి. చట్ట ప్రకారం చూస్తే వాళ్ళిద్దరూ అసలు భార్యాభర్తలు కారు. వాళ్ళు విడాకులు తీసుకుని విసిపోయి చాలా సంవత్సరాలయింది. బేధాభిప్రాయాలు వచ్చి వాళ్ళు విడిపోలేదు. విడిపోవాలని ఏకాభిప్రాయానికి వచ్చే విడాకులు తీసుకున్నారు. చట్టం బారి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న ఉత్తిత్తి విడాకులు అవి!

లాండ్ సీలింగ్ చట్టం అమల్లోకి రాబోతుందని పెద్దవాళ్ళందరికి చూచాయగా తెలిసి ఎవరికి వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా జాగ్రత్త పడుతున్నప్పుడు లాయర్ సారధి చెప్పాడు. వాళ్ళకి ఆ సలహా, భూగరిష్ట పరిమితిని దాటి చెయ్యి జారిపోతున్న మిగులు భూమిని కొంతవరకైనా దక్కించుకోవాలంటే సీతా, రత్నాకరరావు విడాకులు తీసుకోవాలి. అప్పుడు సీత పేరుమీద కూడా కొంత భూమి ఉంచుకోవచ్చు…..మిగులు భూమి అంతా గరవ్నమెంటుకి ఒప్పగించకుండా.

“ఇందులో సిగ్గు పడాల్సింది ఏమి లేదు. గొప్ప వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం నాటకం ఆడుతున్నారు. సేలింగ్ లోనుంచి తప్పించుకోవడానికి. కొందరు బంగారం లాంటి మాగాణి భూములని పాడు పెట్టారు. ఇంకొందరు సిటిలో తమకు ఉన్న ఎకరాల మేర ఖాళీ స్థలాల్లో పేరుకి ఒక గుడిసె వేసి దాన్నే ఇల్లుగా చూపించి , స్థలాలని అమ్మేసుకుంటున్నారు. ఈ పనులన్నీ మీరూ చెయ్యాలి. మీరూ ఇద్దరు భార్యభర్తలుగానే ఉంటె యెంత భూమి మిగులుతుందో విడాకులు తీసుకుంటే అంతకు రెట్టింపు భూమి దక్కించుకోవచ్చు.” అని హెచ్చరించాడు సారధి.

ఒక్క ఈ విషయంలోనే కారు. మరెన్నో విషయాల్లో కూడా చట్టాన్ని చట్టు బండలు చేసి తప్పించుకునే పద్దతులెన్నో అతను చెబుతూ ఉంటాడు వాళ్ళకు. పూతరేకులు యెంత పలచగా ఉంటాయో అంత పలచటివి సీతా, రత్నాకరరావు నైతిక విలువలు!

వాళ్ళకి సారధి ఎక్కువ నచ్చ చెప్పవలసిన అవసరం లేకపోయింది. విడాకులు తీసేసుకున్నారు. చట్ట ప్రకారం విడిపోయినా, ఇద్దరూ భార్యా భార్తల్లా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.

సుదీరని చూడగానే – రా బేబి! ఏమన్నాడు అతను? రెండొందలు ఎక్కువిస్తే ఎగిరి గంతెశాడా?” అడిగాడు రత్నాకరరావు. సఫారి సూట్ వేసుకున్న ఖడ్గమృగంలా మోటుగా ఉన్నాడతను.

 

“లేదు డాడ్! మాములుగానే మాట్లాడాడు. పాపం చాలా అమాయకులు డాడ్- అతను , అతని సిస్టరు, వాళ్ళ ఫాదరు కూడా? దానికి తోడు చెప్పలేనంత చాదస్తం.”

 

“ఎమయిందెం?” అంది సీత.

 

సుమిత్ర రావడం, సీటు వస్తుందని చెప్పినా ఏ ఫార్మాలిటి కోసం కూడా భారతి దత్తతకి ఒప్పుకోకపోవడం- అంతా చెప్పింది సుదీర నవ్వుతూ.

రత్నాకరరావు విరగబడి నవ్వాడు, ” ఇలాంటి పట్టింపులన్ని పెట్టుకు కూర్చుంటే ఇహ బాగుపడినట్లే! ఒక పది లక్షలు కలిసోచ్చేటట్లుంటే చెప్పు. మీ అమ్మని మళ్ళీ పెళ్ళి చేసుకుని, మళ్ళీ వదిలేస్తాను.” అన్నాడు పాలూ, కార్న్ ఫ్లేక్స్  కలిపి ఉన్న వెండి డిష్ సారధి వైపు జరుపుతూ.

అది గమనించి తీవ్రంగా చూసింది సీత. కాకికి ఎంగిలి చెయ్యి విడల్చలేని స్వభావం అమెది. భర్త దుబారా అంటే ఆమెకి చిరాకు. మోటు మనిషి అయినా, తప్పుడు పనులు చేసే డబ్బు సంపాదిస్తున్నా ఖర్చుకి వెనకాడడు రత్నాకరరావు. తన ఆశ్రితుల పట్ల చాలా ఉదారంగా ఉంటాడు.

సీత చూపులు సూదుల్లా గుచ్చుకున్నాయి సారధికి. కార్న్ ప్లెక్సు అందుకోవాదానికి జాచిన చేత్తో కాఫీ ప్లాస్కు తీసుకుని కొద్దిగా కాఫీ మాత్రం కప్పులోకి ఓంపుకున్నాడు.

“వాళ్ళ ఇల్లే ఎంత తమాషాగా ఉందొ తెలుసా, మమ్మీ! తిరపతి గుడిలో పెయింటింగ్స్ వరసగా పెట్టి వుంటాయి చూడూ- అలా తగిలించారు దేశనాయకుల ఫోటోలు. గాంధీని మాత్రం గుర్తుపట్టాను నేను. గాంధీ సినిమా చూశారా మీరు? సింప్లీ సుపర్బ్! మిగతా మొహాలన్నీ ఎవరో! సో మెని ఓల్డ్ ఫెలోస్! పాత చింతకాయ పచ్చడి లాంటి పేర్లూ వాళ్ళును! ఫోటోల కిందే పేర్లూ రాసి ఉన్నాయి గానీ, సరిగా గుర్తు లేదు నాకు. ఒకడు గుంట ఊరి, ఒకడు మంచి కట్ట, ఒకడిది పట్టాభిషేకం లాంటి పేర్లు…బాయ్! ఓ బాయ్!…… అంటూ నవ్వింది సుదీర.

“నీకు తెలుగే సరిగ్గా రాదు!” అంది సీత, అసలైన తెలుగు మమ్మిలా మురిపెంగా. “పైగా చిన్నప్పటి నుంచి ఉటిలో, ఆ తర్వాత అమెరికాలో చదువుకుంటివి. అందుకే వాళ్ళెవరు నీకు తెలియదు. వాళ్ళు టంగుటూరి ప్రకాశం పంతులు, కట్టమంచి రామలింగారెడ్డి, పట్టాభి సీతారామయ్యా అయుంటారు. ఇంతకీ ఎవరు తల్లి అన్ని పాతాకాలపు ఫోటోలు తగిలించిన దేశభక్తుడు?”

కాఫీ మెల్లగా సిప్ చేస్తూ వింటున్న సారధి నెమ్మదిగా కప్పు కిందపెట్టి చెప్పాడు. “అయన ఇండిపెండెన్సు రాకముందు దేశం కోసం ఆస్తి అంతా తగలేశాడు. ఇప్పుడుంటున్న ఇల్లు తప్ప మరేం మిగల్లేదు ఆయనకి. అది తాకట్టులో ఉంది. గవర్నమెంటు ఆయన్ని స్వాతంత్ర్య యోదుడిగా గుర్తించి తామ్రపత్రం ఇచ్చింది. కానీ, పెన్షను ఇంతవరకూ గ్రాంట్ కాలేదు. అయన గవర్నమెంట్ లెక్క ప్రకారం ఉండవలసిన దాని కంటే రెండు రోజులు తక్కువ వున్నాడట జైల్లో……..అందుకని! జైల్లో వున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన హింసల వల్ల ఆయనకి ఒక చెయ్యి, కాలు పడిపోయాయి. అయినా అయన ఇంకా పరోపకారం మానలేదు. తన ఇంటి ముందే ఒక చలివేంద్రంలాంటిది పెట్టి, మిగిలిన ఆ ఒక్క చేత్తోనే చేతనయినంత చేస్తూ ఉంటాడు. ఒక కొడుకు, ఒక కూతురు . కొడుకు డాన్స్ ప్రోగ్రాముల మీద వచ్చే డబ్బుతోనే అతి కష్టం మీద ఇల్లు జరుగుతుంది.

సీతా, రత్నాకరరావు సారధి వైపు ఆశ్చర్యంగా , ప్రశంసా పూర్వకంగా చూశారు. బ్రిలియంట్ లాయర్ అతను. ఎక్సెలెంట్ పైనాన్షియల్ మానేజర్. అద్భుతమైన కంప్యుటర్ లాంటి వాడు కూడా. వాళ్ళకు అవసరమవుతుందనుకున్న సమాచారాన్ని ముందే సైలెంటుగా సేకరించి ఉంచి, సమయం వచ్చినప్పుడు వాళ్ళని ఆశ్చర్య చాకితులని చేయడం ఇది మొదటిసారి కాదు.

“అయన పేరేమిటి?” అంది సీత.

 

“1947 కి ముందు అయన, మీరూ ఒకే ఉళ్ళో ఒకే పేటలో ఉండేవారు. అయన పేరు సదాశివరావు” అన్నాడు సారధి.

 

అతను ఉహించినట్లే సీత మోహంలో రంగు తగ్గింది. తాగుతున్న డ్రింకింగ్ చాకొలేట్ కప్పుని దూరంగా నెట్టేస్తూ, రత్నాకరరావు వైపు భావగర్భితంగా చూసింది. అతను మాట్లాడకుండా లేచి వాష్ బేసిన్ దగ్గిరి కెళ్ళి తుపుక్కున వుమ్మేశాడు.

మరిన్ని 2018 కొత్త కథలు

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!