భామాకలాపం 1

telugu sex stories boothu kathalu కోర్టు ఆవరణ బయట పత్రికా విలేఖరులు కిక్కిరిసి పోయి ఉన్నారు.

సంచలనం కలిగించే కేసు ఇది. కానీ, వాళ్ళెవరు ఆ కేసు ప్రోసిడింగ్స్ చూడడానికి వీల్లేదు ఆ విషయాలని తమ పత్రికలలో ప్రచురించడానికి వీలులేదు.

కేసు విచారణ ‘ఇన్ కెమెరా ‘ పద్దతిలో, గోప్యంగా జరుగుతోంది. అంటే, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులూ, వాళ్ళ లాయర్లు, కోర్టువారు తప్ప ఇంకెవ్వరూ అక్కడ ఉండకూడదు.

స్మార్ట్ గా డ్రెస్ చేసుకుని , హాండ్సమ్ గా , చాల తెలివిగా కనబడుతున్న లాయర్ సారధి తన ఆర్గ్యుమెంట్ పూర్తీ చేస్తున్నాడు. పొడుగ్గా ఉన్నాడతను. విశాలమైన నుదురు, చెంపమీద , కణత మీదా మానిన కత్తి గాట్లాలా ఉన్న గాయాల మచ్చలు కనబడుతున్నాయి. టైలరు చాలా శ్రద్ధగా కత్తిరించి కుట్ట్టిన కోటు అతని భుజాల బలాన్ని చాటుతోంది.

“ఇప్పటిదాకా నేను వివరించిన కారణాలన్నీటి వల్లా హిందూ వివాహ చట్టం కింద నా క్లయింటు శ్రీమతి సుదీరకి, శ్రీ విజయ భరత్ కి జరిగిన వివాహం చెల్లదని, అది రద్దు చేయాలని కోర్టువారికి విన్నవిస్తున్నాను.”

మాన్లిగా వుంటుంది అతని గొంతు. చక్కటి ఉచ్చారణతో, మాడ్యులేషన్ తో, వినేవాళ్ళు ఆకర్షితులైపోయేలా మాట్లాడగల చాకచక్యం ఉంది అతనికి.

చెప్పడం పూర్తీ చేసి సుదీర వైపు చూశాడు సారధి.

“ఈ ప్రపంచాన్నంతా నా చిటికిన వెలికి చుట్టేసుకోగలను” అన్నంత నిర్లక్ష్యంగా కూర్చుని ఉంది సుదీర. సారధి కాక,  ఆమె తాలూకు లాయర్లు ఇంకో ఎనిమిది మంది ఆమెకు దగ్గరలోనే కూర్చుని ఉన్నారు. నల్లకోట్లు వేసుకున్న ఆ లాయర్లు మధ్య హంస రెక్కలా ఉన్న తెల్లటి జార్జేట్ చీర కట్టుకుని రాయంచలా ఉంది ఆ అమ్మాయి.

చాలా అందంగా ఉంది తను. విశాల నయనాలకు పోగరునే కాటుకగా దిద్దికున్నట్లు దర్పంగా ఉన్నాయి చూపులు. కానీ, కొద్ది క్షణాల కోసారి ఆ పెద్ద కళ్ళలో బెదురు కూడా కనబడి మాయమై పోతోంది. ఎదుటి పక్షం లాయరు తనని ఎంత ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతాడో అన్న సంకోచం సుదిరని వేధిస్తోంది.

మొన్నటి దాకా ఆమె భర్తగా చెలామణి అయిన భారత్ దూరంగా కూర్చుని ఉన్నాడు.  సింపుల్ గా ఉంది అతని డ్రస్సు. తెల్లటి చుడిదార్ పైజమా, తెల్ల లాల్చి , కల్లా కపటం లేని మొహం, చంద్రుడు కందిపోతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడతను.

ఆ రోజుకు కోర్టు ముగిసి కేసు వాయిదా పడింది. లాయర్ సారధి సుదీర పక్కన నిలబడ్డాడు. “మనం వెళ్దామా మేడమ్ !” అన్నాడు. గొంతులో మర్యాదా వినయం ప్రకటిస్తూ.

మాట్లాడకుండా లేచి నిలబడింది సుదీరా. వాళ్ళు బయటకు వచ్చి రాగానే ప్రెస్ ఫోతోగ్రాఫర్లు, రిపోర్టర్లు మిడతల దండులా చుట్టేశారు. నలభై , యాబై కెమెరాలు ఆమె మీదకి ఫోకస్ అయ్యాయి.

అది గమనించాడు సారధి. సుదిరకు రక్షణ ఇస్తున్నట్లు అడ్డంగా నిలబడి, తన చేతిలోని బ్రీఫ్ కేసుని ఎత్తి పట్టుకుని ఆమె మొహానికి ఎదురుగా పెట్టాడు ఫోటోల్లో ఆమె మొహం కనబడకుండా.

నిర్లక్ష్యంగా ఎడమ చేత్తో ఆ బ్రీఫ్ కేసుని తోసేసింది సుదీర. “ఫోటోలు తిసుకోనివ్వు. ఐ డోంట్ కేర్”

“మీకు తెలియదు వద్దు!” అన్నాడు సారధి బ్రీఫ్ కేసుతో మళ్ళీ మొహాన్ని కవర్ చేస్తూ.

ఈ హడావుడిలో ఒక్క క్షణం సేపు సుదీర మొహం మేఘాల చాటున చంద్రుడి లాగా కనబడగానే, తన కెమెరాను క్లిక్ మనిమించాడు ఒక ఫోటో గ్రాఫర్.

సారధి పెదవులు బిగుసుకున్నాయి. దగ్గరలోనే నిలబడి ఉన్న ఛోటు వైపు సాభిప్రాయంగా చూసాడు. ఛోటూ సుదీరకి బాడిగార్డ్, డ్రైవరు కూడా.

మరుక్షణంలో ఆ ఫోటో గ్రాఫర్ మీదికి దూకాడు ఛోటూ. కెమెరా గుంజుకుని, ఓపెన్ చేశాడు. ఫిల్మ్ రీలుని బయటికి లాగి, ఎక్స్ ఫోజ్ చేసేశాడు. తరువాత కెమెరాని కింద పడేసి, రెండు కళ్ళతో కసిగా తొక్కి నుగ్గు నుగ్గు చేసేశాడు.

డానికి అభ్యంతరం తెలుపుతూ తక్కిన ఫోటోగ్రాఫర్లు , రిపోర్టర్లు కేకలు వేశారు. తోసుకోవడం, తొక్కిసలాట మొదలయింది.

చాకచక్యంగా సుదీరని తీసుకెళ్ళి ఆమె “అల్పా రోమియో’ కార్లో ఎక్కించాడు సారధి.  పక్కన తను కూర్చున్నాడు.

ఛోటూ తన జేబులో ఉన్న ఇంపోర్తేడ్ స్మిత్ అండ్ వేస్సన్’ రివాల్వర్ ని తడిమి చూసుకుని కారు స్టార్ట్ చేశాడు. తుపాకి గుండులా దూసుకు పోయింది కారు.

సుదీర పరివారం. ఆమె లాయర్లూ మరో ఆరు కార్లలో ఆమెని అనుసరించారు. ఆ కార్లన్నీ సుదీరవే. కొన్న మోడలు మళ్ళీ కొనకుండా కొత్త కొత్త రకాలు కొనడం ఆమెకి సరదా. ఆ కార్లలో ఒక ఫోర్డ్ ఫాల్కన్, డాట్సన్, ఫ్యుజియో, మారుతి, అంబాసిడర్, ఒక ఇటాలియన్ బక్ ఫియటూ ఉన్నాయి.

ఉరేగింపులా సాగిపోయాయి ఆ కార్లన్నీ.

అవమానం, నిస్పృహ మోహంలో కనబడుతూ ఉండగా కోర్టు బిల్డింగు తాలుకూ మెట్లు దిగి, గేటు దగ్గరికి వచ్చాడు భరత్.

సుదీరా వాళ్ల కార్లు లేపిన దుమ్ము ఇంకా గాలిలో అవ్రించుకునే ఉంది. కర్చీఫ్ తో మొహం తుడుచుకుని , మెల్లిగా బస్ స్టాప్ వైపు నడవడం మొదలెట్టాడు అతను.

————

 

అంతకు ముందు మూడు నెలల క్రితం….

హైదరాబాద్ కి నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గార్డెన్ లో ఫంక్షన్ జరుగుతోంది. గార్డెన్ లో ఒక వైపు అనాబ్ షాహి ద్రాక్ష పందిళ్ళు ఉన్నాయి. ఇంకొక వైపంతా పెద్ద పెద్ద వృక్షాలు విశ్రుంఖలంగా పెరిగి ఉన్నాయి. మరో వైపు రకరకాల పూల మొక్కలు.

వీటన్నిటిమధ్యా ఒక రెండు వేల గజాల మేర ఖాళి స్థలం ఉంది. అక్కడంతా అపురూపమైన పర్ఫియన్ కార్పెట్ పరిచినట్లు మృదువుగా పెరిగిన గడ్డి. అక్కడే వెదురు బొంగులతో నిర్మించిన చిన్న కాటేజీ ఉంది. దాని ముందు అలికి, రంగవల్లులు తీర్చి ఉన్నాయి.

లాన్ లో పెద్ద షామియానా, దాని కింద ఒక వేదిక, దానికి ఎదురుగా వంద కుర్చీలు.

ఆ గార్డెన్ సుదీరా వాళ్ళది.

గుండెని మీటేలా గిటార్ వినబడింది. వేదిక మిదినించి అందరూ తలలు తిప్పి చూశారు.

మెడ మీద దాకా పడుతున్న జుట్టుతో, సూట్ వేసుకుని ఉన్న ఒకతను గుసగుస మాట్లాడుతున్నట్లు చిత్రమైన ఇంగ్లీషు ఉచ్చారణతో మైక్ లో చెప్పడం మొదలెట్టాడు.

“గుడివినింగ్ లేడిస్ అండ్ జెంటిల్మన్! మిసెస్ అండ్ మిస్టర్ రత్నాకరరావు గారి కూతురయిన మిస్ సుదీర చదువు పూర్తీ చేసుకుని స్టేట్స్ నుంచి తిరిగి వచ్చారు. మీకు తెలిసే వుంటుంది. ఆమె కోర్నెల్ యూనివర్శిటి స్కూల్ ఆఫ్ హొటల్ అడ్మినిస్ట్రేషన్ లో ఆనర్స్ డిగ్రి తీసుకుని, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు. మిస్ సుదీర ఇండియాకు తిరిగి వచ్చిన సంతోష సందర్భంలో ఏర్పాటు చెయ్యబడింది ఈ పార్టీ!” అతని గొంతులో ఉత్సాహం ఎక్కువయింది.

“వెల్ కమ్ బాక్ టు ఇండియా, మిస్ సుదీరా! వెల్ కమ్!

వెంటనే బాండ్ హుషారుగా అందుకుంది.

అందరూ చప్పట్లు కొట్టారు.

“వెల్ కమ్, సుదీ!” అన్నాడు స్మార్ట్ గా ఉన్న కుర్రాడు ఒకతను సుదీర దగ్గరికి వస్తూ.

సుదీర అతని వైపు కొద్ది క్షణాలు పరీక్షగా చూసి తరువాత గుర్తుపట్టింది. “హయ్ , సతీష్! హౌ డూ యూ డూ? ఏం చేస్తున్నావిప్పుడు?” అంది పలకరింపుగా. అతను తనకి చిన్నప్పుడు క్లాస్ మేట్.

“ఐ ఎ. ఎస్ పాసయ్యాను.”

“ఓహ్ మై మై! సతీష్ కలెక్టరవుతాడా?” అంది నవ్వుతూ.

అతను నవ్వాడు.

“అపుడే ఎక్కడ. పరిక్ష పాసవగానే అయిపోయిందా? ఇంటర్వ్యు లో సెలక్ట్ కావద్దూ?”

“డోంట్ ఫీడ్ మీ దిస్ క్రాప్! ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నిన్ను సెలక్టు చేయించలేరని నన్ను నమ్మమంటావా? బిగ్ జోక్?”

 

“అది సాధ్యం కాని…..”

“నువ్వు గుండెల మీద చెయ్యి వేసుకుని నిజం చెప్పు! మీ డాడీ తన ఇన్ ఫ్లుయేన్స్ తో నిన్ను సెలెక్ట్ చేయించాలేరా?”

అతను భుజాలు ఎగరేసి గుంభనంగా నవ్వాడు.

“వెంకట్ ఏం చేస్తున్నాడు?” అంది సుదీర.

అతను కూడా ఐ.ఎ. ఎస్ పాసయ్యాడు. అయితే తనకి, గన్ షాట్ గా సెలక్షన్ వస్తుంది.”

 

“ఎందుకు?”

 

“రిజర్వేషన్ కోటా!” అన్నాడు సతీష్ చులకనగా.

“రిజర్వేషనా?” అంది సుదీర అర్ధం కానట్లు చూస్తూ.

“యా! దట్ ఛాప్ బిలాంగ్స్ టు షెడ్యుల్డ్ ట్రైబ్- యూనో.’

 

“ఐసీ! అంది సుదీర. వెంకట్ గిరిజనుడు. ఆ సంగతి గుర్తు లేదు తనకి.

“నువ్వే లైన్ లో వెళతావు? హొటల్స్ నా?” అన్నాడు సతీష్.

“వాట్ ఎల్స్?” అంది సుదీర. “హొటల్ బిజినెస్సే! పెద్ద చెయిన్ ఆఫ్ హొటల్స్ స్టార్ట్ చెయ్యాలని ఉంది నాకు. షేరటన్, హిల్దన్- ఇక్కడ ఇండియాలో “తాజ్, ఒబరాయ్ గ్రూప్ ఆఫ్ హొటల్స్ లాగా… ఐ వాన్ట్ స్టార్ ఏ ఫైవ్ స్టార్ హొటల్ ఇన్ ఎవ్విరి బిగ్ సిటీ!”

“నో డౌట్! నువ్వు సాధించి తిరతావు.”

“ఎలా?”

 

“మీ మమ్మీ , డాడి తలుచుకుంటే కొండమీది కోతి అయినా దిగి రాదా?”

నవ్వింది సుదీర. దెబ్బకి దెబ్బ కొట్టేవన్నమాట!”

 

సతీష్ కూడా నవ్వేశాడు. తరవాత తమకంగా సుదీర వైపు చూస్తూ “సుదీ! నువ్వు అప్సరసలకన్నా బాగుంటావు. తెలుసా?” అన్నాడు.

“యూ ఆర్ పుటింగ్ మీ అన్! మునగచెట్టు ఎక్కిచేస్తున్నావు. అవునా?” అని నవ్వి, “హల్లో జెన్ని!” అంటూ దూరంగా జరిగిపోయింది సుదీర.

“సుదీ! యూ ఆర్ లుకింగ్ డివైన్! ఎక్కడ కొన్నావ్ ఈ ఈవినింగ్ గౌను?” అంది జెన్ని మెచ్చుకోలుగా చూస్తూ.

“పియర్రి కార్దిన్” అంది సుదీర. మృదువుగా తన ఒంటి ఓంపులని అంటిపెట్టుకుని ఉన్న గౌను మీద లేని మదతలని సరిచేసుకుంటూ.

జెన్ని వెంటనే కళ్ళప్పగించేసి ఆరాధనగా చూసింది ఆ గౌను వైపు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆ ఫ్రెంచ్ డిజైనర్  తయారు చేసే అద్భుతమైన డ్రెస్ స్ గురించి పుస్తకాల్లో చదవడమే గానీ, ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి తనకి.

“ఎంత?” అంది.

చెప్పింది సుదీర. వెంటనే జెన్ని పెదిమలు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి.

“దీప ఎక్కడుంది? ఏం చేస్తుంది?” అంది సుదీర.

మోహం వెగటుగా పెట్టింది జెన్ని. “తను ఇంటర్ కాస్ట్ మేరేజి చేసుకుంది. విజయవాడలో ఉంటుందనుకుంటాను ఇప్పుడు. ఇంతలో మరొక అరడజను మంది అబ్బాయిలు సుదీరను చుట్టేశారు.

అందరి దృష్టికి తనే కేంద్రమై , సంతోషంగా పార్టీని ఎంజాయ్ చేస్తున్న కూతురి వైపు మురిపెంగా చూస్తున్నారు సీతా, రత్నాకరరావూ.

వాళ్ళకి తెలుసు. ఈ ఫంక్షను దాదాపు ఒక స్వయంవరంలా మారే అవకాశం ఉందని. సిటిలో ఉన్న పెద్ద కుటుంబాల తాలుకూ బ్రహ్మచారులు చాలా మంది వచ్చారు ఆ పార్టీకి. వాళ్ళలో మంచి వరుణ్ణి సెలెక్ట్ చేసుకోవచ్చు సుదీర. లేదా, వాళ్ళలోనే చొరవవున్న కుర్రాడేవరన్నా సుదీరని చూసి ఇష్టపడి పెళ్ళి ప్రపోజలు చెయ్యవచ్చు.

అసలు ఈ ఫంక్షన్ అందుకోసమే ఏర్పాటు చేయించింది మిసెస్ సీతా రత్నాకరరావ్. పనిలో పనిగా ఫంక్షనుకి ఒక మంత్రిగారిని కూడా ఇన్వయిట్ చేసింది. ఆయనకి ఒక దండ వేసి దండం పెడితే అయన ద్వారా తమకి అత్యవసరంగా జరగవలసి ఉన్న ఒక పని కూడా జరిగిపోవచ్చు.

అంత ముందు చూపు ఉంది కాబట్టే,  సీత రాజకియల్ల్లో త్వరత్వరగా పైకి వచ్చేస్తుంది.

 

వేదిక మీద ఆర్కెస్ట్రా సందడిగా వాయించేస్తోంది. హిందీ పాటని పూర్తీ చేసి తెలుగు పాట అందుకుంది పాడుతున్న అమ్మాయి.

 

పాటల ప్రోగ్రాం పూర్తి అయ్యాక తెల్లటి పొడుగు చేతుల బనీను , ఒంటికి అతుక్కున్నట్లు ఉన్న తెల్ల పాంటూ , తెల్ల కాన్వాస్ షూసూ వేసుకుని, మొహానికి సుద్దలాగా తెల్లరంగు పూసుకుని వున్న ఒకతను రంగం మీదికి వచ్చాడు. అతని కనుబొమ్మలూ, పెదవులూ చిక్కటి రంగుతో టచ్ చేసి వున్నాయి.

“లేడిస్ అండ్ జంటిల్మన్! నౌ వీ ప్రెజెంట్ మిస్టర్ అశ్వని ద గ్రేట్ మైమ్ ఆర్టిస్ట్!” అన్నాడు కొంపీర్, తన చిత్రమయిన ఉచ్చారణతో.

మైమ్ అంటే ఏమిటో ముందుగా కొద్ది వాక్యాలతో వివరించాడు అశ్వని. ముఖాభినయం అది. మాటలు, శబ్దాలూ లేకుండా కేవలం చేతులతోనే మిమిక్రి లాంటిది చేస్తూ, ఆడవాళ్ళు చీరె ఎలా సింగారించుకుంటారో, దొంగ ఇంట్లో ఎలా దూరతాడో, ట్రాఫిక్ ని కంట్రోల్ చెయ్యలేని కానిస్టేబుల్ ఏల సతమతమై పోతాడో అనుకరించి చూపి నవ్వించాడు.

‘అవర్ నేక్స్ట్ అయిటమ్ ఈజ్ కూచిపూడి డాన్స్- బై ది రినోన్ద్ ఆర్టిస్ట్ విజయ భరత్!” అని చెప్పాడు కొంపీర్.

గజ్జెలు ఘల్లుమన్నాయి.

విజయ భరత్ వచ్చి అందరికి నమస్కరించాడు.

చిన్నప్పటినుంచి క్రమం తప్పకుండా చేసిన యోగభ్యాసం వల్లా, నిరంతర నృత్య సాధనవల్లా, అతని శరీరం బిగువుగా కండలు తిరిగి గ్రీకు శిల్పంలా ఉంది. చాలా తెల్లగా, బంగారు రంగులో వున్నాడతను. కావలసిన భావాన్ని సులభంగా పలికించగల విశాల నేత్రాలు, ఎత్తుగా ఉన్న ముక్కూ గుబురు మీసాలు , గిరజాల జుట్టు.

చాలా అందంగా ఉన్నాడతను.

 

ఇంతలో కలకలం!

“మంత్రిగారు వచ్చారు. మంత్రిగారు వచ్చారు!” అంటున్నరెవరో.

తెల్లటి అంబాసిడర్ కారు వచ్చి లాన్ పక్కన ఆగింది. మంత్రి కృష్ణస్వామీ కారు దిగి అందరికి నమస్కారం పెట్టి, “క్షమించాలి! కొంచెం ఆలస్యమయింది నా రాక!” అంటూ షామియానా వైపు నడిచారు.

మంత్రిగారి పక్కనే నడుస్తూ వినయంగా ఏదో మాట్లాడుతోంది సీత.

ముందు వరసలో కూర్చున్నారు కృష్ణస్వామీగారు.

నృత్యం మొదలయింది.

సీత కొంచెం దూరంలో నిలుచున్న సారధి వైపు సాభిప్రాయంగా చూసింది. అతను వాళ్ళ ఫామిలి లాయరే కాకుండా, ఆ కుటుంబ సభ్యుల్లో ఒకడుగా చెలామణి అవుతాడు.

ఆమె భావం అర్ధం చేసుకుని ఒక పెడగా వేసిన మరో షామియానా వైపు నడిచాడు అతను.

మంత్రిగారికి మర్యాదలు మొదలయ్యాయి. తెల్లటి యునిఫారాలు వేసుకుని, నడుముకి ఎర్ర పటకాలు , కుచ్చు తలపాగాలు పెట్టుకున్న నౌకర్లు ట్రేలలో బాటిల్సు గ్లాసులూ అమర్చి తీసుకొచ్చారు. గ్లాసులు బాటిల్సుని తాకుతూ, మృదువుగా శబ్దం చేస్తున్నాయి.

 

పెదవులను ఈ చెవి దగ్గర్నుంచి ఆ చెవిదాకా సాగదీసి నవ్వుతూ మంత్రిగారి చెవిలో చెప్పింది సీత. “మంచి ఫాంపెను! మా లోకల్ తయారి కాదు. ఫామిలి ప్రెండు ఒకాయన బర్గండి వెళ్ళి వస్తూ ఒక బాటిల్ తెచ్చి ప్రెజెంట్ చేశారు. ఇది మీకోసం ప్రత్యేకం!” అంది వగలుపోతూ.

బట్లరు షాంపేను కార్క్ ఓపెన్ చేశాడు. “ఠప్” మని శబ్దం. షాంపేను బుసబుసమని నురగలు కక్కుతూ పొంగింది.

ఆ షాంపేను లాగే పొంగింది భరత్ కోపం కూడా. అతను ఆగ్రహంగా చూస్తూ నృత్యం ఆపేశాడు. అతనికి నృత్యమంటే భక్తీ. దానిపట్ల ఆలక్ష్యాన్ని భరించలేడు. వేదిక మీద నుంచి కిందకి దిగి చరచర నడవడం మొదలెట్టాడు.

మంత్రిగారి మొహం జేవురించింది. అయన కూడా చటుక్కున లేచి నిలబడ్డాడు.

 

సీత వైపు తీక్షణంగా చూసి, “మీకు తెలియదేమో నేను మద్యం తాగటం మాట అటుంచి తాకను కూడా తాకను” అన్నారు.

పెద్దపులి తన కోసం ఏర్పాటు చేసిన విందుకు వచ్చి “నేను పచ్చి శాకాహారిని! ఆకులలములు తప్ప భోజనం చెయ్యను!” అని ప్రకటించినంత విడ్డురంగా అనిపించింది సీతకు, తెల్లబోయి, అంతలోనే తేరుకుని మనోహరంగా నవ్వింది. “సారు మరి పబ్లిక్ మీటింగు ల్లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. మరేం ఫర్లేదు. ఇక్కడంతా మనోళ్ళే! మీరు ఫ్రీగా వుండొచ్చు!” అంది.

 

“నేను చెప్పేది చేసేది కూడా ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది” అన్నారు మినిస్టర్ కృష్ణస్వామి తీవ్రంగా.

ఈడ్చి చెంపమీద కొట్టినట్లు అనిపించింది సీతకు. మొహం గంటు పెట్టుకుని, “క్షమించండి! మీకోసం ఆపిల్ జ్యూస్ తెప్పిస్తాను” అని సారధి!” అని పిలిచింది.

“అతనేడి? ఆ డాన్సర్ విజయ్ భరత్! వెళ్ళిపోయాడా?”

 

భరత్ అప్పటికే గేటు దగ్గిరికి వెళ్ళిపోయాడు.

రత్నాకరరావు ముందుకొచ్చాడు. “వాడంతేలెండి! క్రాక్ గాడని ముందే ఎవరో చెప్పారు. ఇదివరకు కూడా ఒకటి రెండు చోట్ల ఇలాగే తల తిక్కగా చేసి సగంలోనే వెళ్ళిపోయాడట! వాడి సంగతి నేను జూసుకుంటాలెండి” అన్నాడు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ.

 

“ఏమిటి మీరు చూసేది? అతను చేసిన డాన్సు చూశారా అసలు? అద్బుతంగా చేస్తాడు. అసలు అతని డాన్సు చూడడానికే తక్కిన ఎంగేజ్ మెంట్స్ అన్నీ కాన్సిల్ చేసుకుని వచ్చాను నేను. అతను డాన్సు చేసున్న టైములోనే మీరు డ్రింక్స్ సర్వ్ చేసి డిస్టర్బ్ చెయ్యడం చాలా తప్పు! అమర్యాద! ఆ కుర్రాణ్ణి వెనక్కి పిలవండి అన్నారు.

“అతను ఎటు వెళ్ళాడో కనిపించడం లేదు. బహుశా ఏ లారినో ఆపి, ఎక్కేసి ఉంటాడేమో” అన్నాడు సారధి, గేటు దాకా వెళ్ళి చూసి వస్తూ.

ఆ తరవాత మీరేవరన్నా వెళ్ళి అతనికి మన అందరి తరుపునా క్షమార్పణ చెప్పిరండి! మీకు వీలుకాకపోయినా, లేదా చిన్నతనమనిపించినా నేనే స్వయంగా అతని దగ్గరకు వెళ్ళి, మన్నించమని అడుగుతాను” అంటూ విసవిసా వెళ్ళి కారేక్కారు కృష్ణస్వామీగారు.

రత్నాకరరావు దంపతులు తేరుకునేలోగానే కారు కదిలి వేగంగా వెళ్ళిపోయింది.

“ఆ డాన్సరుగారు ఎంత తల తిక్కమనిషో, అంతకు మించిన తిక్కలాడిలా  ఉన్నాడే ఈ మినిస్టరు!” అన్నాడు రత్నాకరరావు చిరాగ్గా.

పార్టీ మూడ్ పాడయిపోయింది, అందరూ గుంపులు గుంపులుగా చేరి జరిగిన దాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు.

సుదీర మోహంలో ఉత్సాహం తగ్గిపోయింది. ఇదంతా చిన్నతనంగా ఉంది తనకు.

“అసలు ఈయన్ని ఎందుకు పిలిచావ్?” అన్నాడు రత్నాకరరావు కోపం అంతా సీత మీద చూపిస్తూ.

వేళ్ళతో కణతను నొక్కుకుంది సీత. “ఏం చేస్తాం మరి? మనకు ఆయనతో పని ఉండే! గడ్డి పడేస్తే తినే మనిషి కాడు. కాబట్టి కొంచెం మర్యాదలు చేసి దువ్వుదాం అని పిలిచాను. రేపు మన ఫైలు మీద సంతకం పెట్టె దాకానే ఈయనకి భయపడాలి. ఆ తర్వాత ఆయన్ని ఇక పట్టించుకోవలసిన కర్మ ఉండదు. మీరు వెళ్ళి ఆ కుర్రాడితో కాస్త మంచిగా మాట్లాడిరండి!” అంది.

“నేనా! నేను వెళ్ళనంటే కోపం ఆపుకోలేక మరి నాలుగు అంటించి మరి వస్తాను. సారధిని వెళ్ళమను” అన్నాడు రత్నాకరరావు.

 

సారధి వాచ్ చూసుకున్నాడు. “షెడ్యుల్ ప్రకారం నేను అరగంటలో డిల్లి వెళ్ళాలి. అక్కడ మన కేసు………” అని ఆపేశాడు సగంలో.

“అవును……..నువ్వు డిల్లి వెళ్ళాలి కదూ! పోనీ నువ్వు వెళ్ళొస్తావా సుదీరా?”

నిరసనగా చూసింది సుదీర. “నేనా? నేను వెళ్ళి ఆ పోగారబోతు డాన్సరుకి అపాలజీ చెప్పి వస్తానని నువ్వు అనుకుంటూ వుంటే మమ్మీ, నువ్వు గొప్ప భ్రమలో ఉన్నవన్నమాట! అంది విసురుగా.

“అయినా వాళ్ళకి వీళ్ళకి మనం భయపడటం ఏమిటి? ఎవరూ వెళ్ళక్కర్లేదులే” అన్నాడు రత్నాకరరావు. అతనికి ఆవేశమే గానీ సీత లాగా ముందు చూపు లేదు. అతని పోలికే వచ్చింది సుదీరకి.

అతని వైపు హేళనగా చూసింది సీత. “మొదటినుంచి మీ మాట ప్రకారమే పోయి వుంటే మనం ఇంకా గుడిసెల్లోనే ఉండేవాళ్ళం. గుడ్డెద్దు చేలో పడ్డట్టు దుకేయ్యడం కాదు పౌరుషం అంటే! అదును చూసి చావుదెబ్బ కొట్టాలి. ఒక వారం రోజులపాటు ఈయన కాళ్ళు మనం పట్టుకోక తప్పదు. వారం రోజుల తరువాత మన కాళ్ళ దగ్గర ఈయన ఉంటాడు.

“ఏం …..వారం రోజుల్లో ప్రపంచం తలక్రిందులవుతుందా?” అంది సుదీర.

“మొత్తం ప్రపంచం సంగతేమో గానీ, రాజకీయ ప్రపంచం మాత్రం తలక్రిందులవబోతోంది. వేదిక మీద ఉపన్యాసాలు ఎన్ని ఇచ్చినా, మంత్రి వర్గాలేప్పుడు కులాల ప్రాతిపదిక మిదఎర్పాటు అవుతాయి! మన కులం తాలుకూ ప్రతినిధిగా ఈయన్ని తీసుకున్నారు. కాని ఏం లాభం! కట్టేలాంటి మనిషి! తను తినడూ, ఇంకోళ్ళని తిననివ్వడు! నీతి, నిజాయితీ అంటూ ఒకటే ఉకదంపుడు.! ఇలాంటోడ్ని ఎవరు మాత్రం ఎంతకాలం భరిస్తారూ? అందుకే అందరూ పూనుకుని దింపేస్తున్నారు.

“జస్ట్ ఏ మినిట్. మమ్మీ!” అంది సుదీర. “ఈ మూడు గంటల్లో మూడుసార్లు కులం ప్రస్తావన విన్నాను నేను. వెంకట్ గిరిజన్ అని, దీప ఇంటర్ కాస్ట్ మేరేజ్ చేసుకుందని, ఇప్పుడు- ఈయనకి కులాన్ని బట్టె మంత్రివర్గంలో స్థానం వచ్చిందని ! కులం అంటే అంత పిచ్చి ఏమిటి? ఏ శతాబ్దంలో ఉన్నాం మనం?” అంది చీదరగా.

 

సుదీర వైపు జాలిగా చూసింది సీత. “నువ్వు అమెరికా నుంచి తిరిగి వచ్చి వారం రోజులే అయింది. సుదీ! అందుకే నీకు తెలియదు. ఇక్కడ, ఈ ఇండియాలో పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా చదువుకి, ఉద్యోగాలకి, పేరంటాలకి, పెళ్ళిళ్ళకి, పండగలకి, పబ్బాలకి, రాజకీయాలకి కూడా కులం ప్రసక్తి లేకుండా జరగదు. ఇంకో నెల పోనీ! నీకే అర్ధం అవుతుందిలే!” అంది.

“ఈ చాదస్తపు మినిస్టరు పోతాడంటున్నావ్ గానీ, వీడు పోయి మరో తుగ్లక్ వస్తాడేమో మన ప్రాణానికి?’ అన్నాడు రత్నాకరరావు.

మిస్టిరియస్ గా నవ్వింది సీత. “మీకు బాగా అనుకూలమైన వాళ్ళే వస్తారులెండి!”

“అంత గ్యారెంటిగా చెబుతున్నావే……..ఎవరే కాబోయే మంత్రి?”

 

“నేను!” అంది సీత క్లుప్తంగా…..మన కులానికి ప్రతినిధిగా!”

 

—————-

 

నేను వెళ్ళలేను మమ్మీ! నన్ను బలవంత పెట్టద్దు.” అంది సుదీర మర్నాడు పొద్దున.

“మళ్ళీ మొదటికొచ్చావా? నా మాట వినమ్మా! మా బంగారు కొండవి కదూ! నేను కాబోయే మినిస్టరుని….వెళ్ళి అతని కాళ్ళ మీద పడితే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వయితే ఏదో చిన్న పిల్లవి……..వెళ్ళి సరదాగా మాట్లాడి వచ్చినట్లుంటుంది.”

“అది కాదు మమ్మీ! ఎలాగూ ఇంకో వారంలో నువ్వే మినిస్టరై పోతానంటున్నావు . పైగా , ఈ పోర్టు ఫోలియోనే నీకు ఇస్తారన్నావు. అలాంటప్పుడు మనం వీళ్ళకు భయపడేదేమిటి? రేపు ఆ చెయిర్లో కూర్చున్న తర్వాత మన ఫైలు మీద నువ్వే దర్జాగా ఆర్డర్ పాస్ చేసెయ్యవచ్చు కదా!”

నవ్వంది సీత. “పవరులోకి వచ్చి రాగానే మన ఫైలు మీద మనమే సంతకాలు పెట్టేసుకుని, లైసెన్సులు తీసేసుకుంటే జనం ఊరుకుంటారా? అందుకే ఆయన పదవిలో ఉండగానే అయన చేతే సంతాకాలు పెట్టించేయ్యాడానికి ఈ తొందర. నువ్వు బయలుదేరు.”

“ఓహ్! మమ్మీ!” అని గారంగా విసుక్కుంటూ లేచింది సుదీర.

షవర్ బాత్ తీసుకుని, లావెండర్ కలర్ చైనా సిల్క్ చీర కట్టుకుని, అప్పుడే విరిసిన పువ్వులా సువాసనలు వెదజల్లుతూ పోర్టికోలోకి వచ్చింది. ఫోర్డు ఫాల్కాన్ కారు నిలబడి ఉంది. పోర్టికోలో డ్రైవర్ ఛోటూ మెత్తటి ప్లానల్ గుడ్డతో నీడలు తేలేల కారుని తుడుస్తున్నాడు.

వెనక సీట్లో కూర్చుంది సుదీర. లోపలనుంచి మెరుపులా పరుగెత్తి వచ్చి, ఆమె పక్కనే కూర్చుంది ఒక డాల్మేషియన్ జాతి కుక్క.

“సిల్వర్ ! దిగు!” అని గద్దించింది సుదీర.

నాలుక బయట పెట్టి రొప్పుతూ, జాలిగా చూసింది సిల్వర్.

ఆ చూపులకి కరిగిపోయింది సుదీర. “నాటి బాయ్! సరే రా!” అంది.

ఛోటూ కారుని ముందుకి పోనిచ్చాడు. చిన్న చిన్న సందుల్లో మలుపులు తిరిగుతూ భరత్ వాళ్ళ ఇల్లు చేరేసరికి నలబై నిముషాలు పట్టింది.

 

ఆ వీధిలో ఇళ్లన్నీ పాతకాలపువి. చాలా ఇళ్ళకి ప్రహరి గోడ లేదు. రోడ్డుమిదకే గదులూ, అరుగులు కట్టేశారు. ఒక్క భరత్ వాళ్ళ ఇంటికి మాత్రమే కాంపౌండ్ వాల్ ఉంది. అది కూడా ఒక చోట పడిపోయింది. ఆ కంతలో నుంచి ఒక మేక లోపలికి కాళ్ళు పెట్టి, అందుబాటులో ఉన్న ఒక చెట్టు ఆకులని తెంపి తింటోంది. ఆ గోడకి గేటు ఒకప్పుడు ఉండేదేమో గానీ, ఇప్పుడు మాత్రం లేదు. వెయ్యి గజాల స్థలంలో మధ్యగా కట్టిన పాతకాలపు పెంకిటిల్లు అది. ఇంటి గుమ్మం ముందు నిలబడి చూస్తే వెనక పెరట్లో ఉన్న తులసికోట, కనబడుతోంది. వసారాని జేగురు రంగు కొయ్య స్తంబాలు నిలబెడుతున్నాయి. ఇంటికి ఎడమవైపు ఒక అంకణం కప్పు శిధిలమై కూలిపోయింది.

లోపలనుంచి సన్నటి గొంతుతో ఎవరో అమ్మాయి పాడుతున్నట్లు వినబడుతోంది. డానికి తగినట్లు గజ్జెల చప్పుడు, సామూహికంగా, లయబద్దంగా వినబడుతున్న పద ధ్వని.

కారు ఆగిన శబ్దం విని, ఒక అమ్మాయి కిటికిలోంచి  తొంగిచూసి బయటికి వచ్చింది. ఉన్నట్లుండి నవనవలాడుతూ పొడుగ్గా పెరిగిపోయిన లేత మొక్కలా ఉంది తను. ఆ పొడుగుకి తగినంత ఒళ్ళు ఇంకా రాలేదు. ఒళ్ళు చేశాక ఇంకా ఎంతో బాగుంటుందనిపిస్తుంది చూసేవాళ్ళకి. లేడిపిల్ల కళ్ళలాగా చాలా పెద్ద కళ్ళు. ఆ కళ్ళలోని ఎక్స్ ప్రేషన్స్ చూస్తుంటే భరతే గుర్తు వస్తాడు. నవ యవ్వనానికి సూచనగా కుడి చెంపమీద ఎర్రటి చిన్న మొటిమలు రెండు- చిటికెడు కుంకుమ జల్లినట్లు కనబడుతున్నాయి. కొబ్బరి నూనే పూసుకుని సున్నగా దువ్వి వేసుకున్న పెద్ద జడ నిగనిగలాడుతోంది.

కొత్తవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ ప్రయత్నంగానే ఇంగ్లీషులోకి జారిపోతుంది సుదీర. అమెరికన్ ఉచ్చారణతో “ఐ వాంట్ టు సీ మిస్టర్ భరత్” అంది.

“రండి! అన్నయ్య పిల్లలకు డాన్సు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇంకో పావుగంటలో అయిపోతుంది” అంది లోపలికి దారితిస్తూ.

 

సందేహంగా వెంట నడిచింది సుదీర.

డ్రైవర్ ఛోటూ మళ్ళీ ఫ్లానల్ గుడ్డ తీసి కారు తుడవడం మొదలేట్టాడు. కుక్క సిల్వర్ కారులోంచి కిందికి దూకి, నేలని వాసన చూస్తూ, ఇంటి చుట్టూ ఒకసారి పరిగెత్తి వచ్చింది.

వసారా దాటి ఇంట్లోకి వెళ్లగానే అక్కడ హాలు ఉంది. హల్లో కూడా కొయ్య స్తంబాలు ఉన్నాయి. కుడిచేతి వైపు ఒక గది. ఎడమ చేతి వైపు మరొక గది.

హాల్లోని గోడలకి పైభాగాన సన్నటి చెక్క బద్ద బిగించి ఉంది. దాని మీద ఒక వైపంతా దేవుళ్ళ ఫోటోలు, రవివర్మ వేసిన సరస్వతి, లక్ష్మీదేవి, శ్రీరామ పట్టాభిషేకం, అకుమిడ పడుకుని కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుంటున్న బాలకృష్ణుడి బొమ్మా ఉన్నాయి.

మరో వైపు గోడకి దేశ నాయకుల ఫోటోలు మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రు, ఉక్కుమనిషి వల్లభ భాయ్ పటేల్, ఇక్బాల్, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, కట్టమంచి రామలింగారెడ్డి, ఛత్రపతి శివాజీ, పృధ్విరాజు చౌహాన్, రాణా ప్రతాప్-

ఇంకో గోడకి ఆ కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నాయి. భరత్ పోలికలే ఉన్న ఒకాయన నెహ్రుకి దండ వేస్తున్నప్పుడు తీసిన ఫోటో వుంది. మరో దానిలో లాల్ బహుదూర్ శాస్త్రి ఆయన భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి మాట్లాడుతున్నారు.

వెనకగా ఉన్నది పూజ గది అయి వుండొచ్చు. కర్పూర హారతి, అగరొత్తుల వాసనా, పారిజాత పుష్పాల పరిమళం గాలిలో తేలి వస్తున్నాయి. చిన్న గంట గణగణ మోగింది.

మరిన్ని 2018 కొత్త కథలు

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!