జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 128

By | May 4, 2019
0

telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 128 బైక్ ను అక్కడే వదిలేసి అవ్వ ఇంటివైపుకు నడువగా అప్పటికే తాళం వేసి వాసంతి గారు పనికి వెళ్లిపోవడంతో టర్నింగ్ లో ఉన్న అవ్వ ఇంటికి చేరుకొనగా బయట అరుగు మీద కూర్చున్న అవ్వ దగ్గరికి వెళ్లి అవ్వ అని పిలువగా , కళ్లపై చేతిని పెట్టుకొని ఎవరూ అంటూ దీర్ఘన్గా చూస్తుండగా , అవ్వ నేను మహేష్ ని కొన్నిరోజుల క్రితం పాప గురించి , వాసంతి గారి గురించి నాకు చెప్పారుగా అని వివరిస్తుండగా , కొద్దికొద్దిగా గుర్తుకు వస్తుండగా నువ్వా నాయనా బాగున్నావా? , అయినా ఏమి లాభం నాయనా వాసంతి కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి అంటూ బాధపడుతుండగా ,

దాని గురించే మీతో మాట్లాడదామని వచ్చాను అవ్వ అని చెప్పగా , అవునా నాయనా అయితే రా ఇక్కడ కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టుకోగా , అవ్వ మా గురించి చెప్పలేదు కదూ మేము పక్కనే ఉన్న భవంతిలో ఉంటాము అని చెప్పగానే , ఆత్రంగా నాయనా కొద్దిరోజుల క్రితం బండిపోటుల వల్ల గాయపడిన వాళ్లకు ఎలా ఉంది అని అడుగగా , ఇప్పుడు పూర్తిగా కొలుకున్నారు బామ్మ , ఆమె ఎవరో కాదు మా అమ్మ , పాప మరియు మీ ప్రజలు లేకపోయి ఉంటే తలుచుకుంటేనే నా ప్రాణం విలవిలలాడిపోతుంది. పాప మరియు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేంది ,

పాప వల్ల మా కుటుంబం అంతా సంతోషంగా కలిసిపోయాము కానీ వారు మాత్రం కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు , వారికి సహాయం చెయ్యాలని ఎంత ప్రయత్నించినా వాసంతి గారు సున్నితంగా తిరస్కరిస్తున్నారు , అమ్మ అయితే నీకు ఏ కష్టం రానీకుండా తోబుట్టువులా చూసుకుంటాము మాతో రమ్మని ఎంత ప్రాధేయపడినా , మనసులో దేనికో మదనపడుతూ వారిస్తున్నారు , సూటిగా అడుగుతున్నాను బామ్మ వారి బాధ మీకు తెలిస్తే నాకు చెప్పండి అంటూ చేతులు పట్టుకొని అభ్యర్థించగా ,

మా గూడెం అంతటికీ చదువుకున్నది వసంత మరియు ఆమె మొగుడు మాత్రమే అందుకని అన్ని కుటుంబాల పిల్లలని వసంత దగ్గరికి చదువుకోవడానికి పంపించేవారు మరియు చాలా మర్యాదగా గౌరవిస్తూ కలిసిమెలిసి ఉండేవారు , ఎప్పుడయితే తన మొగుడు గూడెం ప్రజలకు రుణం ఇప్పించి అందరి బాగు కోసం తపించి మోసగింపబడి ఉరి వేసుకొని చనిపోయిన తరువాత ఒక్కసారిగా గూడెం ప్రజలంతా వసంత మొగుడు వల్లనే తమకు ఇన్ని కష్టాలు వచ్చాయని వసంతను దూరంగా ఉంచడమే కాకుండా తమ పిల్లలను కూడా పిల్లలతో కలవనీయకుండా చేస్తూ ఒంటరిగా చేస్తూ కనబడిన ప్రతిసారి ఎత్తిపోస్తూ బాధపెడుతుండగా ,

నాకే బాధగా అనిపించి అప్పుడప్పుడు వెళ్లి పలకరిస్తూ ఉండగా పాప అమ్మా నాన్న ఎప్పుడొస్తారు మనల్ని జూ కి ఎప్పుడు తీసుకెళతారు అని అడుగుతున్నప్పుడల్లా , త్వరలో వచ్చేస్తారమ్మా వచ్చిన వెంటనే మీకు బోలెడన్ని ఆటబొమ్మలు తీసుకువస్తారు , జూ , ఎక్సిబిషన్ ఇలా అన్నింటికీ తీసుకెళ్తారు అంటూ పిల్లలకు కనిపించకుండా కన్నీళ్లతో బాధపడుతూ ఆపద్ధ0 చెబుతూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ,

ఏనాటికైనా మీ కష్టాలను తీర్చడానికి దేవుడి లాంటి మనిషి తప్పకుండా వస్తాడు అని ధైర్యం చూపుతూ ఉండగా , పెద్దమ్మా పిల్లల కోసం జీవిస్తున్నాను లేకపోతే ఎప్పుడో వెళ్లిపోయేదాన్ని అంటూ , ఒకవేళ ఆ దేవుడే వచ్చినా ముందుగా నా గురించి కాకుండా మా వలన ఇబ్బందులు పడుతున్న మన ప్రజలకు కష్టాలను తొలగిపోవాలని కోరుకుంటాను ఎప్పటికైనా మమ్మల్ని క్షమిస్తారని చిన్న ఆశ అంటూ వసంత కుటుంబం తప్పు ఏమాత్రం లేకపోయినా తమ వల్లే ఇక్కడ నివసిస్తున్న వారంతా కష్టాలు అనుభవిస్తున్నారని , వారు కష్టాలలో ఉండగా తాను సంతోషంగా జీవించడం ఇష్టం లేక మీతో అలా మాట్లాడి ఉంటుంది అంతే తప్ప మిమ్మల్ని నొప్పించాలని కాదు నాయనా , వసంత అంత మంచి అమ్మాయి అంటూ కన్నీరు కారుస్తూ బాధపడుతుండగా ,

బామ్మ మాటలకు నా కళ్లల్లో చెమ్మ రాగా , బామ్మ గారు ఆ అప్పు ఇచ్చిన వారి అడ్రస్ ఉందా మీతో అని అడుగగా , వాటి గురించి నాకు తెలియదు నాయనా అదిగో కనిపిస్తున్నదే మా గూడెం పెద్దయ్య ఇల్లు ఆయన ను కలిస్తే వారి గురించి తెలుసుకోవచ్చు అని చెప్పగా , చాలా థాంక్స్ బామ్మా , చివరగా ఒక్క విషయం వసంత గారి తప్పు లేకున్నా మీ గూడెం ప్రజలు కష్టాలు పడుతున్నారని అనుకుంటున్నారు కదా , ఇప్పుడు ఆమె వల్లనే ప్రతి ఒక్కరి కుటుంబం లో సంతోషం అంటే ఏంటో తెలుసుకుని స్వయంగా వారి తప్పును తెలుసుకొని వసంత గారిని దేవతగా తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది అని చెబుతూ బామ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ పెద్దయ్య ఇంటివైపుకు కదిలాను.

రెండు రోజుల క్రితం వర్షం వచ్చినట్లుగా మట్టి దారి మొత్తం గుంతలుగుంతలు పడిపోయి సరైన కాలువలు లేక మురుగు నీరంతా దారి వెంబడి గుంతలలో నిలబడిపోయి 100 అడుగులు నడవడానికి 5 నిమిషాలు పెట్టగా , మేము ఇక్కడికి షిఫ్ట్ అయినప్పటి నుండి కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదని అనుకొని , తలుపు తెరిచి ఉండగా బయట నుండి తలుపు కొడుతూ పెద్దయ్య , పెద్దయ్య అని పిలువగా ,

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *